అసోం, మేఘాలయ సరిహద్దు వివాదం పరిష్కారం

అసోం, మేఘాలయ సరిహద్దు వివాదం పరిష్కారం

అసోం, మేఘాల‌య మ‌ధ్య 5 దశాబ్దాలుగా సాగుతున్న స‌రిహద్దు వివాదానికి తెర ప‌డింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స‌మ‌క్షంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా కేంద్ర హోం మంత్రి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు సమస్యకు ముగింపు పలికేందుకు ఓ ముసాయిదా తీర్మానాన్ని కూడా రూపొందించారు. 

అసోం, మేఘాలయ మధ్య మొత్తం 12 అంశాలపై గొడవలుండగా.. 6 అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకారానికి వచ్చారు. దీంతో దాదాపు 70శాతం సమస్య పరిష్కారమైంది. మిగిలిన ఆరు అంశాలపై కూడా త్వరలోనే అంగీకారం కుదురుతుందని ప్రకటించారు. 50ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసినందుకు రెండు రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు.