అసోంలో వరద విలయం

అసోంలో వరద విలయం

అసోంపై వరుణుడు పగబట్టాడు. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు. సిల్చార్‌లో పర్యటించిన ఆయన.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సహాయక  చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 27 జిల్లాల్లోని దాదాపు 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 637 సహాయక శిబిరాల్లో 2.33 లక్షల మంది తలదాచుకుంటున్నారు. 80,346 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.ని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 121 మంది చనిపోయారు.