వైరస్ నివారణకు యాంటీ మలేరియా డ్రగ్‌ తీసుకున్న డాక్టర్ మృతి

వైరస్ నివారణకు యాంటీ మలేరియా డ్రగ్‌ తీసుకున్న డాక్టర్ మృతి

కరోనావైరస్ చికిత్స కోసం మలేరియా నిరోధక ఔషధమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడిన డాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. అస్సాం గువహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్న ఉత్పాల్జిత్ బర్మన్ శనివారం గుండెపోటుతో మరణించాడు. సీనియర్ అనస్థీటిస్ట్ అయిన 44 ఏళ్ల బర్మన్ కరోనా సోకకుండా ముందుజాగ్రత్తగా ఈ మలేరియా మందును తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ ఔషధం వల్ల గుండెపోటు వస్తుందో లేదో ఇంకా నిర్ధారణ చేయలేదు. కానీ.. దీన్ని తీసుకున్న తర్వాత తనకు నీరసంగా ఉందంటూ బర్మన్ తన సహోద్యోగికి వాట్సాప్ మెసెజ్ చేశాడు. అలా మెసెజ్ చేసిన కాసేపటికే బర్మన్ మృతిచెందాడు.

అయితే కరోనా రోగులకు, వారికి చికిత్సనందిస్తున్న వైద్యులకు మరియు ఆరోగ్య కార్యకర్తలకు వారి కుటుంబసభ్యలకు ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందును వాడాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సు చేసింది. అయితే ఐసీఎంఆర్ మాత్రం క్లోరోక్విన్ మందును సొంతంగా తీసుకోకూడదని కూడా హెచ్చరించింది. అయినా బర్మన్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తనకు తానుగానే ఈ ఔషధాన్ని వాడినట్లు తెలుస్తోంది. కాగా.. అస్సాంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. అందువల్ల దీని వాడకం అక్కడివారికి అవసరం పడలేదు.

దేశంలో మొత్తం మీద కరోనా కేసులు 1430 నమోదు అయ్యాయి. అయితే కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే ఇంకా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. వాటిలో అస్సాం కూడా ఒకటి. అస్సాంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మోడీ ఆదేశాల మేరకు 21 రోజుల లాక్ డౌన్ ను కచ్చితంగా పాటిస్తున్నారు. లాక్ డౌన్ లో ఉండి తమ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాకుండా జాగ్రత పడుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సమీర్ సిన్హా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు మేరకు.. తమ రాష్ట్రంలో స్క్రీనింగ్ మరియు పరీక్షలపై దృష్టిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఒక వేళ పాజిటివ్ కేసులు వచ్చినా ఎదుర్కొవడానికి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలను సిద్ధం చేసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు.

కాగా.. మరో ముఖ్య విషయమేంటంటే.. చైనాలో ఈ క్లోరోక్విన్ ఔషధాన్నే కరోనాకు విరుగుడుగా వాడారు. అక్కడ సక్సెస్ అయిన ఈ మందు అస్సాంలో మాత్రం ఇలా ఎందుకు అయిందనే విషయం తెలుసుకోవడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.

For More News..

లాక్ డౌన్ ను పొడిగించం.. కరోనాకి సామాజిక దూరమే మందు

22 లక్షల మంది చనిపోతారని అంచనాలున్నయ్

కరోనాతో వ్యక్తి మృతి.. మరి అతని ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి?

ప్రభుత్వోద్యోగుల్లో ఎవరెవరికి ఎంత జీతం కోత?