ఐదుగురి ప్రాణాలు తీసిన ఏనుగు మృతి

ఐదుగురి ప్రాణాలు తీసిన ఏనుగు మృతి

మదపుటేనుగు ఒసామా బిన్ లాడెన్ మృతి చెందింది. ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన ఈ ఏనుగును బంధించేందుకు గత కొన్ని రోజులుగా అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఈ నెల 11న ఫలించాయి.. పశ్చిమ అస్సాంలోని గోల్‌పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో కనిపించిన ఒసామా బిన్ లాడెన్ కు మత్తుమందు ఇచ్చి బంధించారు. తర్వాత దాన్ని జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే… ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్న అధికారులు ఓరంగ్ నేషనల్ పార్క్‌కు తరలించారు. ఆ తర్వాత అధికారులు ఈ ఏనుగుకు కృష్ణ అని పేరు పెట్టారు. ఓరంగ్ పార్క్‌లో వదిలినప్పటి నుంచీ ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించిన కృష్ణ నిన్న(ఆదివారం) తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలిసిన ప్రభుత్వం దాని మృతికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులను నియమించింది.

ఆ ఏనుగు సృష్టించిన బీభత్సాన్ని చూసి స్థానికులు దానికి ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పేరును పెట్టారు.