ఇద్దరు పిల్లలు ఉన్నోళ్లకే ప్రభుత్వ ఉద్యోగాలు

ఇద్దరు పిల్లలు ఉన్నోళ్లకే ప్రభుత్వ ఉద్యోగాలు

అస్సా ప్రభుత్వం ఇద్దరు పిల్లల విధానాన్ని చట్టబద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. దీన్ని విస్తృతంగా అమలు చేసేందుకు వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉంది. సంక్షేమ పథకాల్లో ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేసి తీరుతామని ఆ రాష్ట్ర సీఎం హిమాంత విశ్వ శర్మ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలను తీసుకునేందుకు అర్హులుగా ప్రకటిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.

ఇద్దరు పిల్లల విధానం, దాని అమలు చేసే మార్గాల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అస్సా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీజూష్ హజారి తెలిపారు. దీనికి సంబంధించి చేపట్టిన ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.. దీన్ని ఎలా అమలు చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, లబ్ధిదారులకు దీన్ని వర్తింపజేస్తామన్నారు. అయితే.. ఎలా అమలు చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు.