రాహుల్ యాత్రను అడ్డుకున్న అసోం పోలీసులు

 రాహుల్ యాత్రను అడ్డుకున్న అసోం పోలీసులు

ఈశాన్యరాష్ట్రం అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు హేమంత్ సర్కార్ అడుగడగున అడ్డుకుంటోంది.   జనవరి 23వ తేదీ మంగళవారం రాజధాని గౌహతి సమీపంలోని ఖానాపరాలో భారత్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్చ్ చేశారు.  వర్సిటీలో  విద్యార్థులను కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన  ఇబ్బందులేంటని రాహుల్ ప్రశ్నించారు.

జనవరి 22వ తేదీ సోమవారం కూడా అసోంలోని నగావ్ జిల్లాలో దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని రాష్ట్ర సర్కార్  అడ్డుకుంది. దీంతో ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే హేమంత్ సర్కార్ వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. ఈనెల 11న ఆలయంలో దర్శనానికి అనుమతిచ్చిన సర్కార్ 20న తన అనుమతులను వెనక్కి తీసుకుందని మండిపడ్డారు.