తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటికి(నవంబర్ 28) లాస్ట్​ 

తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటికి(నవంబర్ 28) లాస్ట్​ 

హైదరాబాద్  వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకే క్యాంపెయినింగ్​కు అనుమతి ఉన్నది. సోమ, మంగళవారం మాత్రమే మిగిలి ఉండటంతో.. పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పల్లెలు, పట్నాలు జెండాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి.

ప్రధానంగా కాస్త వీక్​గా ఉన్నామనుకునే ప్రాంతాల్లో ఎక్కువ సమయం కేటాయించేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీలు, క్యాండిడేట్లు ఫోకస్​ పెట్టారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు తాయిలాల పంపిణీని కొందరు షురూ జేశారు.