
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండలోని పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో నిల్చొని ఓటేశారు. మిగతా వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, కీరవాణి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తల్లి, కుమార్తెతో కలిసి పద్మారావునగర్‌లో ఓటు వేశారు.
రాజమౌళి ఆయన సతీమణి రమ, నితిన్, సుమంత్, మంచు మనోజ్, రవితేజ, గోపిచంద్, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, రానా ఓటు వేశారు. చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర్‌లో నటుడు ప్రియదర్శి ఓటు వేశారు. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో నటుడు మురళిమోహన్, నరేశ్, గచ్చిబౌలిలోని ప్రభుత్వ స్కూల్లో నాని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.