మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం..రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సభ నివాళి

మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం..రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సభ నివాళి

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి అసెంబ్లీ సం తాపం ప్రకటించింది. సోమవారం అసెంబ్లీ ప్రా రంభం అయిన తరువాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సంతాప ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టారు. 

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నదని స్పీకర్ ప్రకటించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి,  వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 

ఈ ఏడాది అక్టోబర్ 1న రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి 1983 లో చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం ఇద్దరి మృతికి సంతాపంగా 2 నిమిషాలు సభ మౌనం పాటించింది.

10 చట్టాలకు సవరణ

సంతాప తీర్మానాలకు ముందు 10 చట్టాలను సవరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించి అసెంబ్లీలో టేబుల్ చేశారు. ఇందులో జీఎస్టీ సవరణ బిల్లు, జీహెచ్ ఎంసీ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్  చట్ట సవరణ బిల్లు,  జీహెచ్ ఎంసీ రెండో సవరణ బిల్లు, సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, పీఎంశ్రీ ఆడిట్ రిపోర్ట్,  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సవరణ బిల్లు, ఇదే బిల్లు రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ మూడో బిల్లుతో పాటు మరికొన్ని ఉన్నాయి.