మహిళా డ్రైవర్లకు జాబ్ మేళా..జనవరి 3న అంబర్‌‌‌‌‌‌‌‌పేట పీటీసీలో సెలక్షన్ల ప్రక్రియ

మహిళా డ్రైవర్లకు జాబ్ మేళా..జనవరి 3న అంబర్‌‌‌‌‌‌‌‌పేట పీటీసీలో సెలక్షన్ల ప్రక్రియ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర పోలీసులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యాబ్‌‌‌‌, ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్టులో మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా డ్రైవింగ్‌‌‌‌ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జనవరి 3న ఉదయం10:30 గంటలకు అంబర్‌‌‌‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో (పీటీసీ) ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. 

21 నుంచి 45 ఏండ్ల వయస్సు గల మహిళలు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ మేరకు విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీజీ చారుసిన్హా సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

జాబ్‌‌‌‌ మేళాలో ఎంపికైన మహిళలకు స్కూటర్‌‌‌‌, ఈ- ఆటో డ్రైవింగ్‌‌‌‌ ఉచితంగా నేర్పడంతో పాటు శిక్షణ , లైసెన్స్‌‌‌‌, అద్దెకు వాహనాలు, లోన్‌‌‌‌ సుదపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్, మోవో సోషల్ ఇనిషీయేటివ్స్ ఈ మేళాను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆసక్తి గల మహిళలు 8978862299 నంబర్‌‌‌‌కు కాల్‌‌‌‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.