ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్

V6 Velugu Posted on Jun 12, 2021

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటల.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి శనివారం ఆయన.. స్పీకర్‌ను కలిసి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామాను సమర్పించారు. ఆ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. ఉదయం రాజీనామా ఇచ్చిన వెంటనే మధ్యాహ్నం ఆమోదించడం గమనార్హం. ఈటల రాజేందర్ ఆరుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరో రెండు రోజుల్లో బీజేపీలో చేరనున్నారు.

Tagged Bjp, TRS, Hyderabad, Telangana, Eatala Rajender, Assembly speaker, Huzurabad, Eatala resign

Latest Videos

Subscribe Now

More News