వికారాబాద్ జిల్లా అనంతగిరి జాతరకు రండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆలయ ధర్మకర్త ఆహ్వానం

వికారాబాద్ జిల్లా  అనంతగిరి జాతరకు రండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆలయ ధర్మకర్త ఆహ్వానం

వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ఈ నెల 31 నుంచి 15 రోజుల పాటు జరిగే కార్తీక మాస పెద్ద జాతర ఉత్సవాలకు రావాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు  ఆలయ ధర్మకర్త పద్మనాభం, ఈఓ నరేందర్ బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల వసతి సౌకర్యాలపై స్పీకర్ వారితో చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు.