అసెంబ్లీ ని గాంధీ భవన్ లా మార్చిన్రు : ఎమ్మెల్యే తలసాని

అసెంబ్లీ ని గాంధీ భవన్ లా మార్చిన్రు : ఎమ్మెల్యే తలసాని
  • సభను తప్పుదోవ పట్టించి మమ్మల్ని సస్పెండ్​ చేసిన్రు: ఎమ్మెల్యే తలసాని

హైదరాబాద్, వెలుగు: పవిత్రమైన అసెంబ్లీని కాంగ్రెస్​ప్రభుత్వం పార్టీ ఆఫీస్​గాంధీ భవన్​లా మార్చిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్​లీడర్ తలసాని శ్రీనివాస్​యాదవ్​ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజన్నారు. ఇల్లీగల్ మైనింగ్​పై హౌస్​కమిటీ వేయాలని డిమాండ్​చేస్తే అటెన్షన్​డైవర్షన్​లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి చర్చను కులాలపైకి తీసుకెళ్లారన్నారు. 

తన వెంట్రుక కూడా పీకలేరన్నట్టు కడియం శ్రీహరి సైగ చేశారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. సభను తప్పుదోవ పట్టించి తమను సస్పెండ్ చేశారన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్​అభ్యంతరం తెలుపుతుందనే ఇలా చేశారని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీ లేనే లేదని, అలాంటప్పుడు ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా రిఫర్ చేస్తారో చెప్పాలన్నారు.