పల్లాకు కారు లేదట..ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఆస్తులివే..

పల్లాకు కారు లేదట..ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఆస్తులివే..

నల్గొండ, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు వారి ఆస్తులను వెల్లడించారు. ఎన్నికల కమిషన్​కు ఇచ్చిన అఫిడవిట్లలో కుటుంబాల స్థిరచరాస్తులను ప్రకటించారు. టీఆర్ఎస్​ క్యాండిడేట్​పల్లా రాజేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 31.70 కోట్లుగా ప్రకటించారు. ఇందులో 13. 15 కోట్లు చరాస్తులుకాగా, రూ. 18.54 కోట్లు  స్థిరాస్తులుగా పేర్కొన్నారు. ఆయన పేర సొంత కారు లేదు కానీ ఆయన భార్య పేరు మీద 2017 మోడల్​ మారుతీ సెలిరీయో కారు ఉంది. రూ. 4.10 కోట్ల అప్పు ఉన్నట్టు పల్లా వివరించారు. పల్లాకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాలతో పాటు ఆయన పేర 32.10 ఎకరాలు, ఆయన భా ర్య పేరు మీద 10.27 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరు మీద 41.39 ఎకరాల భూములున్నాయి.  షేక్​పేటలో, బాగ్ అంబర్ పేట్​లోని శివం రోడ్డులో ప్రాపర్టీ ఉంది. వరంగల్​లో పిల్లల పేరు మీద స్థలం ఉంది.  బాగ్​అంబర్​పేట, జూబ్లిహిల్స్​లోని నందగిరి హిల్స్, వరంగల్​ జిల్లా షోడెశ​పల్లిల్లో జాయింట్​ ప్రాపర్టీగా రెసిడెన్షియల్​ బిల్డింగ్స్​ ఉన్నాయి.

రాములు నాయక్ ఆస్తులు రూ.1.88 కోట్లు

కాంగ్రెస్ అభ్యర్థి , మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆస్తుల విలువ రూ.1.88 కోట్లు. ఇందులో రూ. 40 లక్షలు చరాస్తులు, రూ. 1.47 కోట్లు  స్థిరాస్తులు. రూ. 16.42 లక్షల అప్పులు ఉన్నాయి. ఆయనకు 2014 మోడల్ ఇన్నోవా కారు, భార్య పేరుమీద రూ. 4 లక్షల విలువైన  బంగారు నగలు, ఎర్రగడ్డలోని బంజారానగర్​లో ఇల్లు ఉన్నాయి.

ప్రేమేందర్ రెడ్డికి రూ.3.72 కోట్లు

బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి రూ. 2.09 కోట్ల చరాస్తులు. రూ. 1.63 కోట్ల స్థిరాస్తులున్నాయి. వరంగల్ అ ర్బన్ జిల్లా దామెరలో 13 ఎకరాల భూమి ఉంది. బీమారంలో తిరుమల సర్వీస్ సెంటర్ పేరుతో కమర్షియల్ బిల్డింగ్ ఉంది. 2012 మోడల్ ఇన్నోవా, 2015 మోడల్ అశోక్  లేల్యాండ్ ట్యాంకర్ ఉన్నాయి.

కోదండరామ్ ఆస్తులు రూ.2.06 కోట్లు

టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్​కు రూ. 2.06 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనకు  మంచిర్యాలలో కమర్షియల్ గో డౌన్ ఉంది. ఆయన పేరు మీద ఎకో స్పోర్ట్,  ఆయన భార్య పేరుతో 2018 మోడల్​ ఇన్నోవా క్రిస్టా వెహికల్స్​ ఉన్నాయి.