డైనోసార్ల అంతం తర్వాతే.. ప్రపంచమంతటికీ పాములు

డైనోసార్ల అంతం తర్వాతే.. ప్రపంచమంతటికీ పాములు

ఆరు కోట్ల ఆరు లక్షల ఏండ్ల కిందట ఓ భారీ ఆస్టరాయిడ్‌‌ భూమ్మీదికి దూసుకొచ్చింది. దాని వల్ల అప్పటి వరకూ భూమిపై రాజ్యమేలుతున్న డైనోసార్‌‌‌‌లు అంతమైపోవడమే కాదు, వాటితోపాటు కొన్ని రకాల జాతులు కూడా నాశనమయ్యాయని సైంటిస్టులు అంటున్నారు. అయితే అప్పటి వరకూ వాటి ఉనికి కాపాడుకోలేకపోయిన 4 వేల రకాల జాతులకు దీని వల్ల బతికేందుకు అవకాశం వచ్చిందని రీసెర్చర్స్‌‌ తెలిపారు. వాటిలో పాములు కూడా ఉన్నాయట. భూమి పొరల్లో ఉండే పాములు వాటి మనుగడ కోసం ఖండాలను దాటాయని ఇంగ్లాండ్‌‌ అండ్‌‌ జర్మనీ రీసెర్చర్స్‌‌ పరిశోధనలో తేలింది. అయితే ప్రస్తుతమున్న మోడ్రన్‌‌ పాముల సంతతుల జెనటిక్‌‌ డిఫరెన్స్​ను రీసెర్చ్‌‌ చేస్తున్నప్పుడు ఈ విషయం బయటపడిందని చెబుతున్నారు.  ఆ సమయంలో భూమ్మీద జరుగుతున్న క్రియేటివ్‌‌ డిస్ట్రక్షన్‌‌ తట్టుకోవడానికి పాములు భూమి అడుగు పొరల్లో నివాసాలను ఏర్పరచుకున్నాయి. ఆహారం లేకుండా చాలా రోజులు అవి బతికేవి. కానీ కొత్త గూళ్లు, ఆహారాన్ని వెతుక్కుంటూ భూమి పొరల్లోంచి ఖండాలను దాటి అవి ప్రపంచమంతా విస్తరించాయని సైంటిస్టులు వెల్లడించారు.  వైపర్స్‌‌, కోబ్రాస్‌‌, గార్టర్‌‌‌‌, కొండచిలువ, బోయాస్‌‌ జాతుల వైవిధ్యత(డైవర్సిఫై) కోసం పాత జాతులను ఎరగా వేస్తూ న్యూ లైఫ్​స్టైల్‌‌, హ్యాబిట్స్‌‌పై సైంటిస్టులు చాలారోజులుగా ఎక్స్‌‌పెరిమెంట్స్‌‌ చేస్తున్నారు. డైనోసార్ల అంతం వల్ల మామల్స్‌‌ (క్షీరదాలు), మనుషులు భూమిపై మనుగడ సాగించేందుకు అవకాశం దొరికిందని రీసెర్చర్స్‌‌ తెలిపారు.