సారీ..సారీ..ఇగ రాజకీయ జాతకం చెప్పను: ప్రముఖ జ్యతిష్యుడు వేణు స్వామి

సారీ..సారీ..ఇగ రాజకీయ జాతకం చెప్పను: ప్రముఖ జ్యతిష్యుడు వేణు స్వామి

ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. దీంతో ప్రముఖ జ్యతిష్యుడు వేణు స్వామి వీడియో సందేశం ద్వారా తన తప్పును ఒప్పుకున్నారు.

 "దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావం తగ్గుతుంది.. అలాగే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పాను. నేను చెప్పిన దాంట్లో మోదీ ఆధిపత్యం దక్కించుకున్నారు. కానీ, ఏపీలో జగన్ పార్టీ ఓడిపోయింది. ఇందులో ఒకటి కరెక్ట్ అయ్యింది.. మరోకటి తప్పు అయ్యింది. వంద శాతం నేను తప్పుగా చెప్పినట్లు ఒప్పుకుంటున్నాను.  నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పుగా వచ్చింది.. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. నాకు ఉన్న విద్యను అనుసరించి, జాతకాల ఫలితంగా.. రాశుల ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చేప్తాను. అంతేగానీ, నేను వ్యక్తగతంగా జాతకం చెప్పలేదు. గత కొన్ని  రోజులుగా నన్ను కొంతమంది టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచివారికి ధన్యావాదాలు. ఏపీలో గెలిచిన చంద్రబాబుకు శుభాకాంక్షలు".

కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఎన్డీఏ కూటమి దాదాపు 160 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లోనూ కూటమి 21 స్థానాల్లో ముందంజలో ఉంది.