అమెరికాలో ఓ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటనలోని అమెరికాలో టెక్సాస్‌లో చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని అస్ట్రో వరల్డ్ ఫెస్ట్ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో జనం తరలివచ్చారు. అయితే షో జరుగుతుండగా ఒక్కసారిగా జనం స్టేజ్ వద్దకు తోసుకొచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే కాన్సర్ట్ నిర్వహిస్తుండగా... స్టేజ్ వద్దకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మృత్యువాత పడగా... చాలామంది గాయాల పాలయ్యారు. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు టెక్సాస్‌కు చెందిన అధికారులు తెలిపారు. వెంటనే షోను నిలిపివేసి.. బాధితుల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించామన్నారు.
