మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి  : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి  : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట/ ములకలపల్లి/ దమ్మపేట, వెలుగు: తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా శనివారం టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ఇద్దరు మహిళలకు రెండు కుట్టుమిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు.

అనంతరం ములకలపల్లి మండలంలో పర్యటించి ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పలువురు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్​ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మూకమామిడిలో ఉపాధి కూలీలకు పనిముట్లు పంపిణీ చేశారు. అంతకుముందు దమ్మపేట మండలంలోని గండుగులపల్లి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాసంలో 88 మంది లబ్ధిదారులకు రూ.88.10 లక్షల చెక్కులు అందజేశారు.