ఆర్టీసీ విలీనంపై కార్మికుల్లో సంతోషం..ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నం

ఆర్టీసీ విలీనంపై  కార్మికుల్లో సంతోషం..ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రకటనను స్వాగతిస్తున్నామని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2019లో సమ్మె చేశాం. ఆ టైమ్ లో 34 మంది చనిపోయారు. ఈ విలీన ప్రకటన అమరవీరులకు అంకితం” అని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. విలీనంపై ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ లేట్ చేయకుండా నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని, సెప్టెంబర్ లో విలీనం పూర్తి చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. యూనియన్ నుంచి ఒకరికి కమిటీలో అవకాశం ఇవ్వాలన్నారు. త్వరలోనే అధికారుల కమిటీని కలిసి జేఏసీ తరఫున సలహాలు, సూచనలు అందజేస్తామని చెప్పారు. బకాయి ఉన్న రెండు పీఆర్సీలు (2017, 2021) ఇవ్వాలని కోరారు. ‘‘ఆర్టీసీ బలోపేతంపై 2018లో కడియం శ్రీహరి అధ్యక్షతన ఏడుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఈడీ నాగరాజు ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇంత వరకు రిపోర్టులు ఇవ్వలేదు. హైదరాబాద్​లో ఆర్టీసీ నష్టాలు జీహెచ్ఎంసీ భరిస్తుందని అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. అది ఇంత వరకు అమలు కాలేదు. యూనియన్లు లేకపోవటంతో ఆర్టీసీలో పనిభారం, ఒత్తిడి పెరిగింది. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి” అని చెప్పారు.

కమిటీ క్లారిటీ ఇవ్వాలి: హనుమంతు

9 ఏండ్ల నుంచి ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కావటం లేదని జేఏసీ కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ అన్నారు. విలీనం ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఎన్నికల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల ముందు విలీనం ప్రకటన చేయడంపై కార్మికుల్లో అనుమానాలు ఉన్నాయని, వీటిపై కమిటీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల టైమ్ లో, మునుగోడు బైపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ లో  ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని గుర్తు చేశారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీలు, డీఏ, రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈయూ నేతల హర్షం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, బాబు హర్షం వ్యక్తం చేశారు. బస్ భవన్ దగ్గర మాట్లాడుతూ.. విలీనం ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ర్టంలో తాము ఈ ప్రతిపాదన తీసుకొచ్చామని, అప్పటి రవాణా మంత్రి బొత్స ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 2019 సమ్మె టైమ్​లో మరో సారి ఈ డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీలో యూనియన్ నేతలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.