Israel, Hamas War : 36 మంది జర్నలిస్టులు మృతి

Israel, Hamas War :  36 మంది జర్నలిస్టులు మృతి

హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న యుద్ధం శుక్రవారం నాటికి ( నవంబర్3) 29వ రోజుకు చేరుకుంది. రెండు వైపులా దాదాపు 10వేల 500 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్పై వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఉత్తర గాజా హమాస్ తీవ్రవాదుల కేంద్రంగా ఇజ్రాయెల్ పై దాడులకు కేంద్రంగా మారిందని ఐడిఎఫ్ ఆ ప్రాంతంపై దాడులు చేస్తోంది. అక్కడి పౌరులను దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో  దాదాపు 9 వేల మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇజ్రాయెల్ లో 1400 మంది మృతిచెందారు. 

Also Read :- గాజాలో భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు మృతి

ఇజ్రాయెల్ , హమాజ్ యుద్దంలో గాజాలో 9వేల061 మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 32వేల మందికి పైగా గాయపడ్డారు , 2వేల  మంది తప్పిపోయారని పేర్కొంది. అక్టోబరు 7 న హమాస్ దాడిలో  ఇజ్రాయెల్ వైపు 1400 మందికి పైగా పౌరులు మృతిచెందారు. ఉగ్రవాదులు దాదాపు 240 మందిని అపహరించారు.వీరిలో నలుగురిని విడుదల చేశారు.

అయితే ఇజ్రాయెల్, గాజా వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులు కూడా ఈ దాడుల్లో మృతిచెందారు. ఇప్పటివరకు 36 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ (CPJ) తెలిపింది. ఈ డెత్ టోల్ లో 31 మంది పాలస్తీనియన్లు, నలుగురు ఇజ్రాయెలీ, ఒక లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు