నేపాల్ లో ఆగని వానలు.. 50 మంది మృతి

నేపాల్ లో ఆగని వానలు.. 50 మంది మృతి

ఖాడ్మండు: భారీ వర్షాలు నేపాల్ ను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం నుంచి ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల వరదల్లో చిక్కుకుని, పలు చోట్ల కొండచరియలు విరిగిపడి.. ఇప్పటివరకు 50 మంది చనిపోయారని, 25మంది తీవ్రంగా గాయపడ్డారని  నేపాల్ పోలీసులు ప్రకటించారు. 1104 మందిని రెస్క్యూ చేశామని, 35 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం దేశవ్యాప్తంగా 27,380 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని మరో రెండు, మూడు రోజులు వానల ప్రభావం ఉంటుందని నేపాల్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాలు 25 జిల్లాల్లో 10,385 ఇళ్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా నేపాల్ సెంట్రల్, ఈస్ట్ ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది.