కరోనా హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం..52 మంది మృతి

కరోనా హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం..52 మంది మృతి

ఇరాక్ లోని కరోనా హాస్పిటల్ లో ఘోర ప్రమాదం జరిగింది. నసిరియా టౌన్ లోని నసిరియా అల్-హాసన్ హాస్పిటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 52 మంది రోగులు చనిపోగా...మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్ ఆవరణలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, డిజాస్టర్ మేనెజ్ మెంట్ ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. మంటలతో హాస్పిటల్ పరిసరాల్లో దట్టమైన పొగలు ఆవరించాయి. కోవిడ్ వార్డుల్లో చిక్కుకున్న రోగులను బయటకు తీసుకువచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వైద్య సిబ్బంది చెప్పారు.