కాబూల్​లో పేలుళ్లు 60 మంది మృతి

కాబూల్​లో పేలుళ్లు 60 మంది మృతి
  • రక్తసిక్తమైన ఎయిర్‌‌‌‌పోర్టు ఎంట్రన్స్.. నేలపై చెల్లాచెదురుగా శరీరాలు
  •  దాడికి కొన్ని గంటల ముందే హెచ్చరించిన అమెరికా, బ్రిటన్
  •  ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ ఎటాక్ చేసిందని అనుమానాలు
  • 120 మందికిపైగా గాయాలు

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌‌లో టెర్రరిస్టు దాడి జరిగింది. ఎయిర్‌‌‌‌పోర్టు బయట ఎదురుచూస్తున్న వేలాది మంది మధ్యలో వరుస పేలుళ్లు సంభవించాయి. సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో ఎయిర్‌‌‌‌పోర్టు ఎంట్రన్స్ రక్తసిక్తమైంది. చెల్లాచెదురైన మానవ శరీరాలతో క్షణాల్లోనే అక్కడి వాతావరణం భయానకంగా మారింది. 60 మందికిపైగా చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    
కాబూల్:అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌‌లో టెర్రరిస్టు దాడి జరిగింది. ఎయిర్‌‌‌‌పోర్టు బయట ఎదురుచూస్తున్న వేలాది మంది మధ్యలో జంట పేలుళ్లు సంభవించాయి. ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. క్షణాల్లోనే అక్కడి వాతావరణం భయంకరంగా మారింది. మొత్తం రక్తసిక్తం. చెల్లాచెదురుగా శరీరాలు.. అవయవాలు కోల్పోయి బాధితుల రోదనలు.. కనీసం 40 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎంట్రన్స్ దగ్గర.. జనం మధ్యలో..
పేలుడులో తమ సోల్జర్లు నలుగురు చనిపోయారని చెప్పిన యూఎస్ అధికారులు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడి చేసిందని భావిస్తున్నట్లు చెప్పారు. 2 ఆత్మాహుతి దాడులు జరగ్గా.. వారితో పాటు ఓ గన్‌‌మన్ ఉన్నట్లు తెలిపారు. ఎయిర్‌‌‌‌పోర్టు ఎంట్రెన్స్​లో అబే గేటు దగ్గర ఓ పేలుడు, బారన్ గేటు వద్ద ఓ హోటల్‌‌కు దగ్గర్లో మరో పేలుడు జరిగిందని పెంటగాన్ అధికారి జాన్ కిర్బీ చెప్పారు. ‘జనం మధ్యలో బాంబు పేలింది. చాలా మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కొందరి అవయవాలు తెగిపడ్డాయి’ అని ప్రత్యక్ష సాక్షి అదామ్ ఖాన్ చెప్పాడు. 
దాడిని ఖండించిన తాలిబాన్
కాబూల్ ఎయిర్‌‌‌‌పోర్టు బయట జరిగిన దాడిపై తాలిబాన్లు స్పందించారు. అమెరికా కంట్రోల్‌‌లో ఉన్న ఏరియాలోనే ఘటన జరిగిందని ఆరోపించారు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. టెర్రర్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము భద్రతపై అత్యంత శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. 
82 వేల మంది తరలింపు.. 
అఫ్గాన్ నుంచి ఇప్పటి వరకు 82 వేల మందిని తరలించామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. గత 24 గంటల్లోనే 19 వేల మందిని తరలించామని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ లిఫ్టింగ్ లలో ఒకటని పేర్కొన్నారు. కాగా, కాబూల్ ఎయిర్ పోర్టు చుట్టూ తాలిబాన్ల కంట్రోల్​ పెరిగిపోయిందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చెక్ పోస్టులలో తాలిబాన్లు తమ సిబ్బందిని  నియమించుకున్నారని, ఎయిర్​పోర్టుకు వస్తున్న ప్రజలను ఆపుతున్నారని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ చెప్పారు. ఆగస్టు 31 తర్వాత కాబూల్ ఎయిర్​పోర్టు నిర్వహణ బాధ్యత తమది కాదని స్పష్టం చేశారు.