నెలకు రూ. 5వేలు పొందే ప్రభుత్వం స్కీం.. అర్హులు ఎవరంటే..

నెలకు రూ. 5వేలు పొందే ప్రభుత్వం స్కీం.. అర్హులు ఎవరంటే..

Atal Pension Yojana: భారత పౌరులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. మహిళలు, వృద్ధులు, కార్మికులు,బాలికలు, చిన్నారులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దినసరి వేతన జీవులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండేందుకు  కేంద్రం ప్రభుత్వం నెలకు రూ. 5వేలు ఇచ్చేందుకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి అర్హులు ఎవరూ.. స్కీంలో ఎలా చేరాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రధాని మోదీ 2015లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్ కు భరోసా కల్పించేందుకు వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ స్కిం అందుబాటులోని తీసుకొచ్చారు. ఇందులో 60 ఏళ్ల తర్వాత పెన్షన్ అందుకోవచ్చు. 

ALSO READ | నెలకు రూ.3వేల పెన్షన్ పొందే కేంద్ర ప్రభుత్వ స్కీం.. అప్లయ్ చేసుకోండిలా..

రోజువారీ వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, చిన్న తరహా వ్యాపారులకు పెన్షన్ లేని కొరతను ఈ స్కీం తీరుస్తుంది. ఇందులో ప్రణాళికతో ఎంతో కొంత జమ చేస్తూ పోవడం వల్ల రిటైర్మెంట్ అంటే 60 ఏళ్లు నిండిన తర్వాత నెల నెలా పెన్షన్ పొందవచ్చు. 

లబ్ధిదారుల వయస్సు, చెల్లించే ప్రీమియం ఆధారంగా రూ. 1000, రూ.2000, రూ. 3000, రూ. 4000 , రూ. 5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 

ఈ స్కీంలో ఎలా చేరాలి.. ఎవరు అర్హులు? 

60 ఏళ్లు దాటిన తర్వాత అసంఘటిత కార్మికులకు సైతం పెన్షన్ అందించాలని కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వారు ఇందులో చేరవచ్చు. వ్యవసాయ రంగానికి చెందిన వారికి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. ఈ పథకంలో గరిష్టంగా నెలకు రూ. 5వేల వరకు పెన్షన్ పొందవచ్చు. 

40ఏళ్ల వయసు వ్యక్తి అయితే నెలకు రూ. 1454 లు చెల్లించాలి. అప్పుడే అతడు నెలకు రూ. 5వేల పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ తక్కువ పెన్షన్ కు ఓకే అనుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం రూ. 291 నుంచి మొదలై రూ. 1454 మధ్య ఉంటుంది.