వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అటల్​ టన్నెల్

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అటల్​ టన్నెల్

హిమాలయాల్లోని పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ లో సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో, 9.02 కిలోమీటర్ల పొడవున బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన అటల్ టన్నెల్ ఇది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ, లడఖ్​లోని లేహ్ ప్రాంతాలను కలిపే ఈ టన్నెల్ ను ప్రధాని మోడీ 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించారు. ఈ టన్నెల్ తాజాగా 10 వేల అడుగుల కంటే ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ గా వరల్డ్ బుక్ ఆఫ్​ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ మేరకు లండన్ లోని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం రికార్డ్ సర్టిఫికెట్ ను అందించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.   

మరిన్ని వార్తల కోసం..

శ్రీశైలంలో పవర్ జనరేషన్‌‌ ఆపండి

బస్సు ఎప్పుడొస్తదో.. ఎన్ని సీట్లున్నయో తెలుసుకోవచ్చు