అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయం సబ్ కలెక్టరేట్​గా మార్పు

అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయం సబ్ కలెక్టరేట్​గా మార్పు

అచ్చంపేట, వెలుగు:  నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్డీఓ ఆఫీస్​ను సబ్ కలెక్టరేట్​గా  మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వంలో అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ తర్వాత డివిజన్ కేంద్రంగా ప్రకటించింది.  తాజాగా సబ్ కలెక్టర్ కార్యాలయంగా మార్చడంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానుంది . 

అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, వారం రోజుల్లో ఐఏఎస్ అధికారి నియామకం జరిగే అవకాశం ఉందని అచ్చంపేట ఆర్డీఓ మాధవి తెలిపారు.