Kargil to Kanyakumari: ఈ రోజుల్లో ఫిట్‌నెస్ గోల్స్ అంటే జిమ్‌కు వెళ్లడం లేదా కాసేపు రన్నింగ్ చేయడం అనుకుంటాం.. కానీ, ఇండోర్‌కు చెందిన ఇంటర్నేషనల్ అల్ట్రా రన్నర్ కార్తీక్ జోషి మాత్రం ఏకంగా దేశాన్ని చుట్టేసే రేంజ్‌లో ఒక మైండ్‌బ్లోయింగ్ రన్నింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాడు. 'కార్గిల్ టు కన్యాకుమారి' (K2K) పేరుతో జరుగుతున్న ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో కార్తీక్ ఏకంగా 4,200 కిలోమీటర్లు పరిగెత్తనున్నాడు. ఫేమస్ బ్రాండ్ 'స్కెచర్స్' (Skechers) సపోర్ట్‌తో సాగుతున్న ఈ జర్నీలో.. అతను 'స్కెచర్స్ ఏరో బర్స్ట్', 'ఏరో స్పార్క్' మోడల్ రన్నింగ్ షూస్ ఉపయోగిస్తున్నాడు.
11,575 అడుగుల ఎత్తు.. మంచు, వర్షంలోనూ తగ్గేదేలే:
మే 2వ తేదీన కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర మొదలైన ఈ క్రేజీ ఛాలెంజ్‌లో కార్తీక్ ఇప్పటికే 844 కిలోమీటర్లకు పైగా దూరాన్ని చాలా ఈజీగా కంప్లీట్ చేసేశాడు. ఈ దారిలో అతనికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా 11,575 అడుగుల ఎత్తులో ఉండే 'జోజిలా పాస్' దగ్గర విపరీతమైన చలి, మంచు, వర్షం, కొండచరియలు విరిగిపడటం వంటి డేంజరస్ పరిస్థితులు ఉన్నా అస్సలు తగ్గకుండా ముందుకు కొనసాగాడు. కేవలం 55 రోజుల్లోనే ఈ టార్గెట్‌ను ఫినిష్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలనేది కార్తీక్ ప్లాన్.. ఈ నెల చివరి నాటికి ఈ పరుగు కన్యాకుమారిలో ముగియనుంది.
స్కెచర్స్ సీఈఓ రాహుల్ వీరా ఏమన్నారంటే:
కార్తీక్ జోషీ చేస్తున్న ఈ పరుగు మనుషుల నమ్మకాన్ని, పట్టుదలను చూపిస్తోంది.. ఇలాంటి లాంగ్ జర్నీలలో అథ్లెట్లకు ఫుల్ కంఫర్ట్ ఇచ్చేందుకే మా 'ఏరో బర్స్ట్' షూస్‌ను డిజైన్ చేశాం.. ఈ హిస్టారికల్ రన్‌లో కార్తీక్‌కు సపోర్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందని స్కెచర్స్ సీఈఓ రాహుల్ వీరా వెల్లడించారు.
జోజిలా పాస్ దాటడం పెద్ద టాస్క్:
తన హోమ్ టౌన్ అయిన ఇండోర్‌కు చేరుకుంటున్న సందర్భంగా కార్తీక్ జోషి మాట్లాడుతూ.. జోజిలా పాస్ దాటడం ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గా కూడా పెద్ద టాస్క్.. కానీ దారిపొడవునా జనాలు ఇచ్చిన బూస్టప్ నన్ను ముందుకు నడిపించింది.. నా రన్నింగ్ జర్నీలో స్కెచర్స్ షూస్ నాకు బెస్ట్ పార్ట్‌నర్‌గా మారి బాగా హెల్ప్ అవుతున్నాయని చెప్పాడు.
ALSO READ : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కోహ్లీ సందడి..
ఫ్యూచర్ రన్నర్లకు ఉచిత కిట్లు:
ఇండోర్‌లో పెరిగిన కార్తీక్, ఇండియాలో రన్నింగ్ అండ్ ఫిట్‌నెస్ కల్చర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగా, గ్రౌండ్ లెవెల్‌లో ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసే 100 మందికి పైగా యంగ్ రన్నర్లకు ఉచితంగా రన్నింగ్ కిట్లను పంపిణీ చేయాలని కార్తీక్ టీమ్ డిసైడ్ అయింది. ఈ పరుగు ముంబై, బెంగళూరు మీదుగా సాగుతూ కన్యాకుమారిలో గ్రాండ్‌గా ముగియనుంది.
मिशन कारगिल से कन्याकुमारी के अंतर्गत 4200 किलोमीटर की ऐतिहासिक दौड़ पर निकले युवा धावक कार्तिक का इंदौर आगमन हुआ। उनके अदम्य साहस, अनुशासन और राष्ट्रभक्ति के इस प्रेरणादायी अभियान में इंदौरवासियों, रनर्स, साइक्लिस्ट्स एवं फिटनेस प्रेमियों के साथ सहभागी बनने का सौभाग्य प्राप्त… pic.twitter.com/3wUam0UVST
— Pushyamitra Bhargav (@advpushyamitra) June 1, 2026
