జెమిని సురేష్, రూప జంటగా పృథ్వి, సమ్మెట గాంధీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆత్మకథ’. శ్రీనివాస్ బండ్రెడ్డి దర్శకత్వంలో సోమేష్ నిర్మిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ మూవీ టైటిల్‌తోపాటు ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, నటుడు కె.వి ప్రదీప్, నటి కరాటే కళ్యాణి ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం సాధించాలని కోరారు. జెమిని సురేష్ మాట్లాడుతూ ‘ఒక ఇంట్లో జరిగే కథ ఇది. కామన్‌మేన్ ఎమోషన్స్, భయం, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రం’ అని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇదని దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి అన్నాడు. నటులు సమ్మెట గాంధీ, కుమనన్ పాల్గొన్నారు.
