Kajal Choudhary: యూనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీతో ‘అనగనగా’ఫేమ్ కాజల్ చౌదరి.. అట్లాస్ సైకిల్​ అత్తగారు పెట్లేదంటూ

Kajal Choudhary: యూనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీతో ‘అనగనగా’ఫేమ్ కాజల్ చౌదరి.. అట్లాస్ సైకిల్​ అత్తగారు పెట్లేదంటూ

కార్తిక్ రాజు, ‘అనగనగా’ఫేమ్ కాజల్ చౌదరి జంటగా ‘105 మినిట్స్’ఫేమ్ రాజా దుస్సా దర్శకత్వంలో గాలి కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’.శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేష్ బాబు క్లాప్ ఇవ్వగా, హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.

తొలిషాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ, ఎమోషన్ కలగలిసిన పీరియాడికల్ మూవీ ఇది.  1980 లో  వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం’అని చెప్పాడు.

యూనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీతో వస్తున్న ఇలాంటి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని హీరోహీరోయిన్స్ చెప్పారు.  ఇందులో తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతీ, శ్రీధర్ రెడ్డి, ప్రభావతీ, అభయ్, ఫణి, పద్మ, కీర్తిలత ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. మల్లవరం వేంకటేశ్వర  రెడ్డి , రూప కిరణ్ గంజి కో ప్రొడ్యూసర్స్.