ఆటమ్‌ టీ9 గోల్ఫ్‌ విన్నర్‌ బౌల్డర్‌ హిల్స్‌ టైగర్స్‌

ఆటమ్‌ టీ9 గోల్ఫ్‌ విన్నర్‌ బౌల్డర్‌ హిల్స్‌ టైగర్స్‌

మెహిదీపట్నం/హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ప్రముఖ ఎలక్ట్రిక్‌‌ బైక్స్‌‌ సంస్థ ‘ ఆటమ్‌‌’  స్పాన్సర్‌‌ చేసిన ఆటమ్‌‌ టీ9 చాలెంజ్‌‌ గోల్ఫ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బౌల్డర్‌‌ హిల్స్‌‌ టైగర్స్‌‌ జట్టు విజేతగా నిలిచింది. గచ్చిబౌలి బౌల్డర్‌‌ హిల్స్‌‌ గోల్ఫ్‌‌ క్లబ్‌‌లో శనివారం జరిగిన ఫైనల్లో  టైగర్స్‌‌ టీమ్‌‌ 2–1తో నోవాటెల్‌‌ స్టార్స్‌‌ జట్టును ఓడించి టైటిల్‌‌ గెలిచింది. ఇక, బ్రాంజ్‌‌ మెడల్‌‌ కోసం జరిగిన మ్యాచ్‌‌లో జాగృతి జాగ్వార్స్‌‌ 2–1తో టీ ఈగల్స్‌‌ టీమ్‌‌పై విజయం సాధించింది. విజేతలకు విశాక గ్రూప్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌  గడ్డం సరోజా వివేక్, జేఎండీ గడ్డం వంశీకృష్ణ  ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు.  ఎలక్ట్రిక్‌‌ వాహనాలు వినియోగించాలన్నారు. ఈ టోర్నీకి స్పాన్సర్‌‌గా వ్యవహరించిన ఆటమ్‌‌ ఎలక్ట్రిక్‌‌  బైక్స్‌‌తో తక్కువ ధరకే ప్రయాణించవచ్చని, పది రూపాయల ఖర్చుతో బ్యాటరీ చార్జ్‌‌ చేస్తే.. సుమారు వంద  కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాక్సింగ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌ నిఖత్‌‌ జరీన్‌‌ తదితరులు పాల్గొన్నారు.