హైదరాబాద్ సిటీలో దారుణం.. మైనర్కు గంజాయి తాగించి అత్యాచారం

హైదరాబాద్ సిటీలో దారుణం.. మైనర్కు గంజాయి తాగించి అత్యాచారం

హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. మైనర్ కు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు రౌడీషీటర్లు. బాలిక మత్తులో ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ మృగాళ్లు. ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.  

హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణం. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు పరారీలో ఉన్నారు. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని  డాక్టర్లు తెలిపారు. 

బాలిక చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి వెళ్ళినట్లు పోలీసులు చెబుతున్నారు.  నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. నార్సింగి లో నానమ్మతో నివసిస్తుండటంతో.. మిస్సింగ్ కేసు నర్సింగ్  స్టేషన్ లో నమోదు చేశారు.

బాధితురాలు నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీకి చెందిన బాలికగా గుర్తించారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.