హైదరాబాద్‌లో రౌడీ షీటర్ హత్య.. బుల్లెట్ల కలకలం

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ హత్య.. బుల్లెట్ల కలకలం

హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. RCI రోడ్డులో కాంచన్ బాగ్ కు చెందిన...రౌడీ షీటర్ రియాజ్ ను గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బైక్ పై వెళ్తున్న రియాజ్ ను వేరే వాహనంతో ఢీకొట్టారు. తర్వాత రాడ్ తో దాడి చేసి, కాల్పులు జరిపి హత్య చేశారు. 

ఘటనా స్ధలాన్ని రాచకొండ సి పి సుధీర్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, సౌత్ జోన్ అడిషనల్ డిసిపి షేక్ జహంగీర్ పరిశీలించారు. మృతదేహాన్ని  హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. బుల్లెట్లను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.