మూగజీవాలపై కర్కశత్వం..అడ్డుకున్న మహిళ, వృద్ధుడిపై దాడి

మూగజీవాలపై కర్కశత్వం..అడ్డుకున్న మహిళ, వృద్ధుడిపై దాడి

మూగజీవాలపై కొందరు కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని కొత్త మండల కేంద్రంలో ఓ కుక్కను చిత్రహింసలకు గురి చేసిన ఘటన మరువకముందే.. మరోకటి చోటు చేసుకుంది. కేవలం పంట మేత మేశాయంటూ రెండు మేకలను చిత్రహింసలకు గురి చేశారు. ఒక మేక చనిపోగా.. మరో మేక కంటి చూపు కోల్పోయింది. దీనిని ఆపేందుకు ప్రయత్నించిన యువతిని, వృద్ధుడిపై దాడి చేశారు. ఈ ఘటన రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రానికి చెందిన గిరిజన మహిళ రజిని మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. యదావిధిగా మేకలను మేపుతోంది. పక్కనే ఉన్న పంటల్లోకి వెళ్లి మేకలు మేత వేస్తున్నాయి.

దీనిని చూసిన యజమాని చేబ్రోలు రామారావు, పెంట్యాల రాజేష్ లు ఆగ్రహానికి గురై.. కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శించారు. రెండు మేకలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ మేక అక్కడికక్కడనే చనిపోయింది. మరో మేక కంటి చూపు కోల్పోయింది. రజినిని దుర్భషలాడుతూ.. దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న మరో గేదెల కాపరి వృద్ధుడు నాగులు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అతనిపై కూడా కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న స్థానికులు అతడిని మధిర ఆసుపత్రికి తరలించారు. దీనిపై తాము పీఎస్ లో కంప్లైట్ ఇవ్వడం జరిగిందని రజిని తెలిపారు.