V6 News

కత్తులు, బాకులతో హల్ చల్..

 కత్తులు, బాకులతో హల్ చల్..

హైదరాబాద్ మల్లేపల్లిలోని జ్యూస్ సెంటర్‌పై కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. జులై 15వ తేదీ శనివారం రాత్రి మల్లేపల్లి రోడ్‌లో ఉన్న జ్యూస్ సెంటర్ ‘సమ్మర్ ల్యాండ్’ అద్దాన్ని నలుగురు వ్యక్తులు పగలగొట్టారు.  దుకాణానికి వచ్చిన అపరిచిత వ్యక్తులు.. ఎవరితోనో  ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ముగ్గురు కుర్చీలు తీసుకుని దుకాణం అద్దాలను పగులగొట్టారు. చేతుల్లో  కత్తులు, బాకులు పట్టుకుని ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

తమ జ్యూస్ సెంటర్ పై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారని యజమాని ఒమర్ తెలిపాడు.  వారందరూ మారణాయుధాలు కలిగి ఉన్నారని చెప్పాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తులపై కేసు నమోదు చేశామని హబీబ్ నగర్ పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. అయితే  ఒమర్, మరికొందరు వ్యక్తుల మధ్య ఆస్తి విషయంలో వివాదం ఉందని, దాని ఫలితంగానే దాడి జరిగిందని సమాచారం.