రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికుల తీవ్ర దాడి

V6 Velugu Posted on Jun 03, 2019

ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కు రాజస్థాన్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు… ఓ దొంగతనం కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్ వెళ్లారు. భీల్ వాడా జిల్లా బరాతియా గ్రామంలో దొంగల ఆచూకీ తెల్సుకుని.. పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐతే.. స్థానికులు అనూహ్యంగా స్పందించారు. తెలంగాణ పోలీసులైన ASI శివకుమార్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో ASI శివకుమార్ తలకు గాయమైంది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు. వీరిని రాజస్థాన్ లోని భీల్ వాడా జిల్లా రామ్ సనేహి హాస్పిటల్ లో చేర్పించారు అక్కడి పోలీసులు. ఈ ముగ్గురు ప్రస్తుతం ICUలో ఉన్నట్టు తెలిపారు.

కొంతమంది స్థానికులపై హత్యాయత్నం కింద రాజస్థాన్ పోలీసులు కేసు పెట్టారు. కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Tagged telangana police, rajastan, Attack On Police, Attack on Telangana Police

Latest Videos

Subscribe Now

More News