- తొమ్మిదో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం అర్ధరాత్రి స్కూల్ హాస్టల్రూమ్ ల్లోని గోడలకు ఇంటర్ స్టూడెంట్లు మేకులు కొడుతుండగా.. తమకు ఇబ్బందిగా ఉందని కింది ఫ్లోర్ లోని తొమ్మిదో తరగతి విద్యార్థులు అడ్డుచెప్పారు. దీంతో ఇంటర్ స్టూడెంట్లు గ్రూప్ గా వెళ్లి గొడవకు దిగారు. అడ్డుకునేందుకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థి అజ్మీరా దీపక్‌ను కొట్టడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
స్కూల్ స్టాఫ్‌ను కూడా తోసేశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన దీపక్‌ను తోటి స్టూడెంట్లు, సిబ్బంది నర్సంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. విద్యార్థి దీపక్ ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు నిర్ధారించి డిశ్చార్జ్‌చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్డీటీడబ్ల్యూఓ సౌజన్య, నర్సంపేట టౌన్ ఎస్ఐ రవికుమార్ స్కూల్ కు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థులను ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
