ప్రతిపక్షాలపై దాడులు ఆపాలి

ప్రతిపక్షాలపై దాడులు ఆపాలి
  •      వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో  ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసన

ముషీరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతల అకౌంట్లు ఫ్రీజ్​చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా తెలిపారు. శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసన తెలిపారు. అజీజ్ పాషా మాట్లాడుతూ..

 ప్రధాని మోదీ లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ఏజెన్సీలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుంటుందన్నారు. నిరసనలో వామపక్ష నేతలు ఎన్. బాల మల్లేశ్, పశ్య పద్మ, డీజీ నరసింహారావు, మల్లు లక్ష్మి, గోవర్ధన్, కోటేశ్వరరావు, జానకి రాములు, రాజా రమేశ్, ఎన్.జ్యోతి  పాల్గొన్నారు.