
- హైదరాబాద్ లో ఘటన
ఎల్బీ నగర్, వెలుగు : గణేశ్ మండపం వద్ద లడ్డూ చోరీకి యత్నించిన ఇద్దరు యువకులను హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని మన్సురాబాద్ రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఒక వాహనంపై వచ్చి లడ్డూను దొంగలించేందుకు యత్నించారు.
లడ్డూ తీసుకొని పారిపోతుండగా అదే సమయంలో అక్కడ కాపలా కాస్తున్న చందు అనే యువకుడు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దొంగతనం కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. గొడ్డేటి అజయ్, బొడ్డుపల్లి మహేశ్ అనే ఇద్దరు నిందితులను మన్సూరాబాద్ లోని సప్తగిరి కాలనీలో అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు.