భర్తపై హత్యాయత్నం ... వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య నిర్వాకం

భర్తపై హత్యాయత్నం ... వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య నిర్వాకం

కూకట్​పల్లి, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తపై హత్యాయత్నం చేయించిన ఘటన  కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. కూకట్​పల్లి పరిధిలోని సుమిత్రానగర్​లో నివసించే భూపాల్​(29), చంద్రకళ(27) భార్యాభర్తలు. భూపాల్​ కూలి పని చేస్తుండగా, చంద్రకళ ఇళ్లల్లో పనికి వెళ్తుంది. 

కొంతకాలంగా చంద్రకళకు దుర్గయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం చంద్రకళ పనికి వెళ్లింది. ఆమె వెళ్లిన పది నిమిషాలకే ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్క్​లు ధరించి భూపాల్​ ఇంట్లోకి చొరబడ్డారు. 

కింద పడేసి గొంతు, మొహం, మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేశారు. చావుకేకలు వేయడంతో ఆగంతకులు పరారయ్యారు. తన భార్యే తనపై దాడి చేయించిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దుర్గయ్యతో పాటు అతని స్నేహితుడు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.