మైనర్​పై  అత్యాచారయత్నం

V6 Velugu Posted on Aug 04, 2021

ఆర్ఎంపీ డాక్టర్​ను అరెస్ట్ చేసిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: మైనర్ బాలికపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోaకి వచ్చింది. సుచిత్రకి చెందిన ఓ బాలిక(16)కు జ్వరం రావడంతో సోమవారం  ఆమె తల్లి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లింది. అతడు బాలికను పరిశీలించి  లోపలికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.  బాలిక అరవడంతో తల్లి లోపలికి వెళ్లింది. బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె  వెంటనే డాక్టర్​పై  పేట్ బషీరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. దీంతో శ్రీనివాస్ రెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతడిని
 అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Tagged Hyderabad, Minor girl, , Attempted rape, RMP doctor

Latest Videos

Subscribe Now

More News