లవ్ ఫెయిల్యూర్ .. అటెండర్ సూసైడ్

లవ్ ఫెయిల్యూర్ .. అటెండర్ సూసైడ్

బషీర్ బాగ్, వెలుగు:   ప్రేమలో విఫలమైన బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అబిడ్స్ పోలీసులు తెలిపిన ప్రకారం.. సైఫాబాద్ చెందిన ఓంకార్ శేఖర్(27) నాంపల్లిలోని కో –ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో అటెండర్. కొంతకాలంగా ఓ యువతిని అతడు ప్రేమిస్తుండగా నిరాకరిస్తుంది. దీంతో సోమవారం శేఖర్ డ్యూటీకి వెళ్లాడు. బ్యాంక్ మూడో అంతస్తులోని వాష్ రూమ్ కిటికి గ్రిల్స్ కు వైరుతో ఉరేసుకొని చనిపోయాడు. పైకి వెళ్లిన అతడు కిందికి రాకపోగా తోటి సిబ్బంది వెళ్లి చూడగా బాత్ రూమ్ లో చనిపోయి కనిపించాడు. సమాచారం అందించగా అబిడ్స్ పోలీసులు వెళ్లి కేసు నమోదు చేశారు.  

హెల్త్ ప్రాబ్లమ్ తో బాలుడు..

కొడంగల్​, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతూ ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ​మున్సిపల్​పరిధి గుండ్లకుంటకు చెందిన వడ్ల పెద్ద భీములుకు  ఇద్దరు కొడుకులు. చిన్నకొడుకు వెంకటేశ్(16) చదువు మధ్యలోనే ఆపేశాడు. కొంత కాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్దామని సోమవారం కొడుకుకు తండ్రి చెప్పాడు. వస్తానని చెప్పి.. వెంకటేశ్​ వ్యవసాయ భూమి వద్దకు పోయి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు చూసి చికిత్స కోసం  ఆస్పత్రికి  తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. డెడ్​బాడీకి పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేసినట్టు  కొడంగల్ ఎస్ఐ భరత్​కుమార్​ రెడ్డి తెలిపారు.