
- అందుబాటులో అన్ని రకాల సస్టయినబుల్ ప్రొడక్ట్‌లు
- స్టార్టప్‌లతో టై అప్ కానున్న కంపెనీ
- త్వరలో మిగిలిన మెట్రో సిటీల్లో కూడా...
హైదరాబాద్, వెలుగు: సస్టయినబుల్ (పర్యావరణానికి మేలు చేసేవి) ప్రొడక్ట్‌లను కస్టమర్లు ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు హైదరాబాద్ కంపెనీ విశాక ఇండస్ట్రీస్ బెంగళూరులోని ఎంజీ రోడ్‌లో ఆటమ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్‌లో ఎఫ్‌ఎంసీజీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, సస్టయినబుల్ బిల్డింగ్ మెటీరియల్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి వివిధ రకాల ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచారు. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల సస్టయినబుల్ ప్రొడక్ట్‌లను ఆటమ్ లైఫ్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా పర్యావరణానికి మేలు చేయాలనుకునే స్టార్టప్‌లు తమ ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్‌గా పని చేస్తుంది. ఈ సెంటర్‌ను ఆటమ్ లైఫ్ ఫౌండర్ గడ్డం వంశీ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ఇండస్ట్రీ పెద్దలు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. కస్టమర్లకు పర్యావరణానికి హాని చేయని ప్రొడక్ట్‌లను అమ్మడం, తయారీదారులకు ఒక ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులో ఉంచి వారిని ప్రోత్సహించడమే ఆటమ్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. బెంగళూరులోని ఆటమ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ల ఆర్గానిక్ గ్రోసరీ, ఫుడ్, బట్టలు, కాస్మోటిక్స్, స్కిన్ కేర్, ఫుట్‌వేర్, లైఫ్‌స్టైల్ యాక్సిసరీస్, హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, బిల్డింగ్ ప్రొడక్ట్‌లను ప్రదర్శనకు ఉంచారు.
ఒకే గొడుగు కిందకు...
బెంగళూరు మార్కెట్‌లో ఎంటర్ అవ్వడం ఆనందంగా ఉందని గడ్డం వంశీ పేర్కొన్నారు. సస్టయినబుల్ ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. జీవన విధానాలను మార్చుకోకపోతే భూమిపైన, ఫ్యూచర్ జనరేషన్‌పైన తీవ్ర ప్రభావం పడుతుందనే సింపుల్ కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిందే ఆటమ్ లైఫ్ అని వివరించారు. ఫ్యూచరిస్టిక్ట్ టెక్నాలజీలతో పాటు, రీసైకిల్ లేదా అప్‌సైకిల్ చేసిన ప్రొడక్ట్‌లను కన్జూమర్లకు ఆటమ్ లైఫ్ అందుబాటులో ఉంచుతుందని అన్నారు. స్టార్టప్‌లు, ఎకో ఫ్రెండ్లీ ఆలోచన విధానాలున్నవారితో కలిసి పనిచేస్తామని, కన్జూమర్లకు అన్ని రకాల సస్టయినబుల్ ప్రొడక్ట్‌లను ఒకే గొడుగు కింద అందిస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని మెట్రోల్లో ఆటమ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.