చిరంజీవికి ఈ యేడు మిక్సిడ్ రిజల్ట్ ఇచ్చింది. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటిస్తున్న ఆయన.. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా విజయాన్ని అందుకున్నారు. కానీ ద్వితీయార్థంలో వచ్చిన ‘భోళా శంకర్’తో ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరిచారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథలో నటిస్తున్నారు.
