ఆదిపురుష్ Vs రామాయణం సీరియల్ : దేనికి ఎంత ఖర్చు పెట్టారు.. ఎంత వచ్చింది

ఆదిపురుష్ Vs రామాయణం సీరియల్ : దేనికి ఎంత ఖర్చు పెట్టారు.. ఎంత వచ్చింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేసిన ఆదిపురుష్(Adipurush) సినిమాపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో సన్నివేశాల మార్పు, సంభాషణలపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీంతో ఈ సినిమాను టీవీలో ప్రసారమైన రామాయణం సీరియల్(Ramayanam serial) తో పోల్చుతున్నారు. 1987లో రూపొందించబడిన ఈ రామాయణం సీరియల్ ను బీట్ చేసే మరో సీరియల్ ఇప్పటివరకు రాలేదు. ఈ సీరియల్లో రాముడి పాత్రలో అరుణ్ గోవిల్(Arun Govil) కనిపించగా.. సీతగా నటి దీపికా చిక్లియా(Deepika Chiklia) కనిపించింది. 80వ దశకంలో ఈ రామాయణం సీరియల్ ఒక రికార్డ్. ఈ సీరియల్ తరువాత కూడా చాలా భక్తిరస సీరియల్స్ ప్రసారమయ్యాయి కానీ..రామాయణం సీరియల్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. 

మొత్తం 78 ఎపిసోడ్స్ ప్రసారమైన ఈ రామాయణం సీరియల్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వారానికి ఒకరోజు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు రూ.9 లక్షలు ఖర్చయిందని సమాచారం. ఇక మొత్తంగా 78 ఎపిసోడ్స్ గాను.. రూ.7 కోట్ల రూపాయలు ఖర్చవగా..  రూ.24 కోట్ల భారీ మొత్తాన్ని రాబట్టిందట ఈ సీరియల్. దీంతో టెలివిజన్ హిస్టరీలోనే ఇది ఒక రికార్డ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. 

ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే.. రూ.500 కోట్ల బడ్జెట్, ప్రభాస్ లాంటి స్టార్ కాస్ట్, అత్యాధునిక టెక్నాలజీ. ఇవన్నీ కలిసినా కనీసం సీరియల్ ఇంపాక్ట్ కూడా ఇవ్వలేకపోయిందని, అయినా సినిమా తీయాలంటే కావాల్సింది కంటెంట్ అనీ..  ఖర్చు కాదని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.