మోగ్లీకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు

మోగ్లీకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు

రోషన్ కనకాల హీరోగా ‘కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ రూపొందించిన   చిత్రం ‘మోగ్లీ 2025’. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.   పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్  నిర్మించారు.  డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోషన్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు  మా నమ్మకాన్ని నిజం చేశారు. ఈ సినిమానే నా జీవితం అనుకున్నా. 

ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అవ్వకుండా వర్క్ చేశా.  ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని,  గొప్ప రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది.  థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   కొన్ని మూమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు.  నా రెండో సినిమాకి ఇలాంటి కథ రావడం నా అదృష్టం’ అని అన్నాడు. తన పాత్రను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ హీరోయిన్ సాక్షి థ్యాంక్స్ చెప్పింది.  ఇందులోని కామెడీ, ఎమోషన్ సహా అన్నిటికీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారని  డైరెక్టర్ సందీప్ రాజ్ అన్నాడు.  

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ నుంచే ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది.   ఇలాంటి చిన్న  సినిమాకి తొంభై శాతం  ఆక్యుపెన్స్ రావడం అనేది పెద్ద విషయం’ అని అన్నారు.  ఇది తమకు  ప్రౌడ్ మూమెంట్ అని నటుడు వైవా హర్ష అన్నాడు.