- సింగూరు పైప్ లైన్ కు లీకేజీతో అంతరాయం
హైదరాబాద్, వెలుగు: సింగూరు నుంచి సిటీకి తాగునీరు సరఫరా చేసే 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ అవుతుంది. షేక్ పేట్, టోలిచౌకి, గోల్కొండ, భోజగుట్ట, గండిపేట, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
