AUS vs RSA: సఫారీలను బెంబేలిస్తున్న స్టార్క్, హేజిల్‌ వుడ్‌.. 24 పరుగులకే 4 వికెట్లు

AUS vs RSA: సఫారీలను బెంబేలిస్తున్న స్టార్క్, హేజిల్‌ వుడ్‌.. 24 పరుగులకే 4 వికెట్లు

కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా తడబడుతోంది. లీగ్ దశలో పోటీపడి సెంచరీలు బాదిన సఫారీ బ్యాటర్లు.. కంగారూ బౌలర్ల ముందు మాత్రం తేలిపోతున్నారు. ఆసీస్ ప్రధాన పేసర్లు స్టార్క్, హేజిల్‌ వుడ్‌ ధాటికి 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే కష్టాల్లో పడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్.. 14 ఓవర్లు ముగిసేసరికి 44/4. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0) తొలి ఓవర్‌ లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కాసేపటికే ఫామ్‌లో ఉన్న డేంజరస్‌ బ్యాటర్ క్వింటన్ డికాక్‌(3)ను హేజిల్‌వుడ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై మార్‌క్రమ్‌ (6)- డసెన్‌ (5) జోడి ఆదుకునే ప్రయత్నం చేసినా.. మరోసారి స్టార్క్, హేజిల్‌ వుడ్‌ జోడి వీరిని పెవిలియన్‌ చేర్చారు. ఎయిడెన్‌ మార్క్‌రమ్‌(10) స్టార్క్ ఔట్ చేయగా.. ఆ మరుసటి ఓవర్లోనే హెజిల్‌వుడ్‌..  వాండెర్‌ డసెన్‌ను వెనక్కిపంపాడు. దీంతో సఫారీ జట్టు 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్సిన  డేవిడ్ మిల్లర్(10 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (10 నాటౌట్‌) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.