ఆస్ట్రేలియా 487 ఆలౌట్‌‌‌‌

ఆస్ట్రేలియా 487 ఆలౌట్‌‌‌‌

పెర్త్‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (90), అలెక్స్‌‌‌‌ క్యారీ (34) రాణించడంతో.. 346/5 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 113.2 ఓవర్లలో 487 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. మార్ష్‌‌‌‌, క్యారీ ఆరో వికెట్‌‌‌‌కు 90 రన్స్‌‌‌‌ జోడించినా.. పాక్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అమెర్‌‌‌‌ జమల్‌‌‌‌ (6/111) కంగారూలను ఇబ్బందిపెట్టాడు.

చివరి ఐదు వికెట్లలో నాలుగు పడగొట్టి  రన్స్‌‌‌‌ను అడ్డుకున్నాడు. మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (12), కమిన్స్‌‌‌‌ (9), నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (5), హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ (4 నాటౌట్‌‌‌‌) నిరాశపర్చారు. కుర్రం షహజాద్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాకిస్తాన్‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 53 ఓవర్లలో 132/2 స్కోరు చేసింది. ఇమామ్‌‌‌‌ (38 బ్యాటింగ్‌‌‌‌), కుర్రం షహజాద్‌‌‌‌ (7 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాక్‌‌‌‌ ఇంకా 355 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది.