యాషెస్ సిరీస్ మూడో టెస్టు.. తొలి రోజే తోక ముడిచిన ఆసీస్

యాషెస్ సిరీస్ మూడో టెస్టు.. తొలి రోజే తోక ముడిచిన ఆసీస్

యాషెస్ సిరీస్ లో భాగంగా హెడింగ్లీలో ఇంగ్లండ్ తో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకే ఆలౌట్ అయింది.  ఓపెనర్లు త్వరగా ఔటైన మార్ష్  సెంచరీతో అదరగొట్టాడు.  అయితే మార్ష్ ఔటయ్యాక  ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియిన్  కు క్యూ కట్టారు. మార్ష్  తరువాత ఆసీస్ ఆటగాళ్లలో హెడ్ (39) దే అత్యధిక స్కోర్. 

ఇక ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 5 వికెట్లు తీయగా, వోక్స్ 3, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టారు.  ఆ తరువాత  ఇన్సింగ్స్ ప్రారంభించిన 10 ఓవర్లు ముగిసే టైమ్ కు రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో జోరూట్ (15), జాక్ క్రాలీ(27) పరుగులతో ఉన్నారు.  ఇంకా  ఇంగ్లండ్ 209 పరుగులు వెనకబడి ఉంది.  

ఆస్ట్రేలియా  :  డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్  :  జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో(w), బెన్ స్టోక్స్(c), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్