IND VS AUS : 188 పరుగులకే కుప్ప కూలిన ఆస్ట్రేలియా

IND VS AUS : 188 పరుగులకే కుప్ప కూలిన ఆస్ట్రేలియా

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మొదటి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా 35.4  ఓవర్లలోనే ఆసీస్ ను 188 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. భారత పేస్ బౌలర్లు ఈ మ్యాచులో సత్తా చాటారు. జడేజా రాణించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసి మొదటి బ్రేక్ అందించాడు. తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ ని చక్క బెట్టాడు.

మార్ష్ (81) దూకుడుగా ఆడుతుంటే కెప్టెన్ స్మిత్ మాత్రం ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మొదలు పెట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వేసిన 12.3 ఓవర్లో కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి స్మిత్ (22) వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 77 వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

దూకుడుగా ఆడుతున్న  మార్ష్ ను జడేజా 19.4 వ ఓవర్ వద్ద పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మార్ష్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ సిరాజ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. 22.4 ఓవర్ లో లబుషేన్ (15) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బోల్తా కొడతాడు.

అదిరిపోయే డెలివరీలు వేస్తూ షమీ, సిరాజ్ విజృంభించారు. బ్యాట్స్ మెన్ ని పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. జోష్ ఇంగ్లిస్ (26), కామెరూన్ గ్రీన్ (12) షమీ ఔట్ చేశాడు. తర్వాత మ్యాక్స్ వెల్(8) ను 32.3 ఓవర్ వద్ద జడేజా ఔట్ చేశాడు. కెప్టెన్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరుతాడు.

33.4 ఓవర్లో శుభ్ మన్ గిల్ సూపర్ క్యాచ్ మరో వికెట్ అందిస్తాడు. సిరాజ్ బౌలింగ్ లో సీన్ అబాట్ (0) గిల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అవుతాడు. దాంతో ఆసీస్ 188 పరుగులకు 9 వికెట్లు కోల్పోతుంది. 35.4 ఓవర్ వేసిన సిరాజ్ జాంపాని ఓట్ చసి భారత్ కు చివరి వికెట్ ను అందిస్తాడు.

 టీమిండియా బౌలర్లలో సిరాజ్, షమీలకు 3, జడేజా 2, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ లభించాయి. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగిలిన ఏ బ్యాట్స్ మెన్ కూడా 30 పరుగులు దాటలేకపోయారు.